సంక్షిప్తం... ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా 10 మండలాల నుంచి ఇద్దరు చొప్పున వచ్చిన సిఆర్పి కృషి సఖి సభ్యులకు జులై 28 నుంచి ఈ నెల 3 వరకు ఆత్మ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఎడపల్లి మండలo జైతాపూర్ గ్రామములో శుక్రవారం పాపారావు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్నీ సందర్శించారు. మహిళలకు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జీవామృతం ఏ విధంగా చేయాలో ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఈ శిక్షణ శిబిరంలో, వ్యవసాయ అధికారులు, పాల్గొన్నారు.