కరెంట్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన డోర్నకల్లో చోటుచేసుకుంది. నరసింహులపేట మండలానికి చెందిన క్రాంతి కుమార్ లైన్మెన్గా పని చేస్తున్నాడు. డోర్నకల్ మండలంలో విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా 11 కేవీ కేబుల్ తగిలి మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.