అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పట్టణంలోని గుంతకలప్ప కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బూచి రాంప్రసాద్ లతో కలిసి గుంతకల్లు నియోజకవర్గంకి సంబందించిన 33 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ గుంతకల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నామని అన్నారు.