రేపల్లె డిపో పరిధిలోని హైర్ బస్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని, వారికి ఆర్టీసీలో ఆన్ కాల్ డ్రైవర్లుగా డ్యూటీలు కేటాయించాలని సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్. మణిలాల్ డిమాండ్ చేశారు. బాపట్ల సిఐటియు కార్యాలయంలో శనివారం జరిగిన మదర్ థెరిస్సా హైర్ బస్ ప్రైవేట్ డ్రైవర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 35 మంది హైర్ బస్ డ్రైవర్లు ఉన్నప్పటికీ, కొత్తగా ఎంపికైన ఆన్ కాల్ డ్రైవర్లకు డ్యూటీలు కేటాయించడం దారుణమని అన్నారు. ఎయిర్బస్ డ్రైవర్లు కూడా పాన్ కార్డ్ డ్రైవర్ లాగా డ్యూటీలు ఏర్పాటు చేయాలని కోరారు.