జిల్లా కలెక్టర్ రాజర్షి షా సిరికొండ మండలంలో విస్తృతంగా పర్యటించారు. సుంకిడి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం తో పాటు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,సిరికొండ జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యాస సామర్ధ్యాలను స్వయంగా పరీక్షించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేనందున ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థుల సంఖ్యను పెంచాలనిసూచించారు.విద్యార్థులు పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడాలని అన్నారు. అంగన్వాడి కేంద్రం పరిధిలో బరువు తక్కువగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.