మహబూబాబాద్ పట్టణంలోని బాలసదనంలో వివిధ కేసులలో కౌన్సిలింగ్ కొరకు వచ్చి పారిపోయిన నలుగురు మైనర్ బాలికలపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సిఐ మహేందర్ రెడ్డి గురువారం సాయంత్రం 4:00 లకు తెలిపారు. గత రాత్రి నైట్ డ్యూటీ లో ఉన్న అటెండర్ జయమ్మ ను తిట్టి చేతులతో కొట్టి రూమ్ తాళం, మెయిన్ గేట్ తాళాలు మరియు తన సెల్ఫోన్ గుంజుకొని పారిపోయారని బాలసదనం సూపర్డెంట్ ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.