కావలి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టిడిపి నేత మధుబాబు నాయుడు మంగళవారం తీవ్రంగా స్పందించారు. ఈ పరిణామాలకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డినే మూలకారణమని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతోనే ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని మధుబాబు నాయుడు అన్నారు. కావలి గడ్డ ఆత్మాభిమాన గడ్డ అని, బయటి నాయకులు ఇక్కడ రాజకీయాలు చేయలేరని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది.