స్టీల్ ప్లాంట్ పరిధి ఉక్కునగరంలోని డిపాల్ పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఉదయం ఆందోళన చేపట్టారు. వేలకు వేలు ఫీజులు కట్టించుకునే యాజమాన్యం విద్యార్థులకు సరైన విద్యాబుద్ధులు నేర్పడం లేదని ఆరోపించారు. ఇదేమని ప్రశ్నించడానికి అడిగితే అడిగితే పాఠశాల సిబ్బంది ప్రిన్సిపాల్ ను కలవడానికి కూడా అనుమతించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, విద్యాశాఖ దీనిపై పట్టిస్తే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.