మహబూబాబాద్ పట్టణంలోని కంకర్ బోర్డ్ ప్రాంతంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు టౌన్ సిఐ మహేందర్ రెడ్డి సైబర్ నెరాల పై శనివారం సాయంత్రం 4:00 లకు అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ.. చాలామంది ఉద్యోగులు విద్యావంతులు సైబర్ నేరగాళ్ల చేతిలో పడి లక్షల రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్, వాట్సప్ వీడియో కాల్స్, ఆన్లైన్ ఓటీపీలను నమ్మకూడదన్నారు. వాటిని ఉపయోగించడం వల్ల డబ్బులు పోయే అవకాశం ఉందన్నారు. సైబర్ నేరానికి గురైతే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలన్నారు.