ఒంటరిగా వాకింగ్ చేసే మహిళల మెడలోని బంగారు ఆభరణాలను దొంగతనం చేసే అంతరాష్ట్ర ఇరానీ ముఠా దొంగలను చిత్తూర్ వన్ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు దీనికి సంబంధించిన వివరాలను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియాకు వివరించారు సుమారు 20 లక్షలు విలువచేసిన 192 గ్రాముల బంగారు ఆభరణాలు అలాగే మూడు లక్షలు విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని మొత్తం దీని విలువ 23 లక్షలని వీరిపై చిత్తూరు జిల్లా పరిధిలో అలాగే మదనపల్లి వీకోట పరిధిలో 8 కేసులు నమోదైనట్లు చెప్పారు.