త్రాగు నీరు , వీధి దీపాలు సమస్యలపై డి ఆర్ సి సమావేశం లో చర్చించడం జరిగిందని త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శనివారం డి ఆర్ సి సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ వీసీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, కలెక్టరేట్ లో డి ఆర్ సి సమావేశం నిర్వహించామని, గత సమావేశంలో లేవనెత్తిన సమస్యలు పరిష్కరించామని అన్నారు.