విద్యార్థి, యువజన ,మహిళ సంఘాల ఆధ్వర్యంలో విశాఖ రామకృష్ణ బీచ్ వద్ద జల దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా *అఖిలభారత విద్యార్థి సమాఖ్య(ఏ.ఐ.ఎస్.ఎఫ్) జిల్లా కార్యదర్శి ఉల్లం.నాగరాజు, అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి కెంగువ. అచ్యుతరావు ,ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జిల్లా అధ్యక్షురాలు వనజాక్షి* మాట్లాడుతూ 32 మంది ప్రాణ త్యాగంతో ఏర్పాటు చేసుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయడానికి ఖండించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని హామీ ఇచ్చారన్నారు