Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 1, 2025
పెన్షన్ల విషయమై వైసిపి ఫేక్ ప్రచారం చేస్తున్నదని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన కందుకూరులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ వైసిపి నేతల తీరుపై ధ్వజమెత్తారు. నకిలీ వికలాంగుల చేత ఫేక్ ప్రచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారని ఎద్దేవా చేశారు. అనర్హులకు పెన్షన్లు పంపిణీ చేసిన చరిత్ర వైసిపి పాలనకు ఉందని విమర్శించారు. అర్హులైన ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదని అన్నారు.