కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నం స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు,మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు అధ్యక్షతన.మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు.ఈసమావేశంలో పెద్దాపురంలో జంగిల్ క్లియరెన్స్ పేరుతో స్వాహాకి పాల్పడ్డారని దీనిపై తక్షణం విచారణచేపట్టాలని అధికారులను కౌన్సిలర్లు నిలదీశారు.అక్కడక్కడ అత్యవసర పనులు ముసుగులో మున్సిపల్ ఆదాయానికి గండికొట్టారని ఎద్దేవాచేశారు.చేసినటువంటి పనులలో ఎక్కడ నాణ్యత లేదని,ఈ విషయంలో ఇంజనీరింగ్ శానిటేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తిగా,అలసత్వాన్ని వహించి ప్రజాధనానికి తూట్లు పొడిచారని ఆరోపించినట్లు శనివారం సాయంత్రం 6గం కు తెలిపారు.