నంద్యాల జిల్లా అవుకు మండలం చెర్లోపల్లికి చెందిన మధు డీఎస్సీకి క్వాలిఫై అయ్యాడు. అయితే ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో ఉండే ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న బనగానపల్లె ఫైర్ ఎస్ఐ సత్యం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియపరిచి, బాధితుడికి న్యాయం చేస్తామని ఆయన తెలిపారు.