ఈనెల 9వ తేదీ మంగళవారం ఉదయం 9:30 గంటలకు ఒక్క ఉద్యోగి ఒక్కో మొక్క నాటే కార్యక్రమంలో జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పక పాల్గొని మొక్క నాటాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకుదోవాదం చేసి భవిష్యత్ తరాల భద్రతకు మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని “ఏక్ పేడ్ మాకే నామ్” స్పూర్తితో సిద్దిపేట జిల్లాలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల సహకారంతో ఒక్కో ప్రభుత్వ ఉద్యోగితో ఒక మొక్కను నాటించే విధంగా ప్రణాళిక విధం