విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పట్టించు కోవడంలేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజేశ్ విమర్శించారు. సంగారెడ్డిలో మీడియా సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైన స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం సిగ్గుచేటని చెప్పారు. స్కాలర్షిప్ చెల్లించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వివరించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ సంగారెడ్డి కలెక్టరేట్లేదట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.