వీణవంక: మండలం చల్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి నంబర్ కోసం గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటి నంబర్ కేటాయించడానికి ఇరవై వేలు డిమాండ్ చేశాడు పంచాయతీ సెక్రెటరీ నాగరాజు.దీంతో బాధితుడు ఏ సి బి అధికారులను ఆశ్రయించాడు రంగం లో దిగిన ఏసిబి అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం పంచాయతీ సెక్రెటరీ నాగరాజు ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నాగరాజు పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసిపి డిఎస్పి విజయ్ కుమార్ తెలిపారు