అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో సిపిఐ కార్యాలయంలో జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, నియోజకవర్గ కార్యదర్శి మురళి శనివారం మాట్లాడుతూ. హంద్రీనీవా జలాలను కుప్పానికి తీసుకెళ్లి జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనడం స్వాగతిస్తున్నామని అన్నారు. మదనపల్లి. పుంగనూరు. మండలాలలో త్రాగునీరు సాగునీరు కోసం ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని . మదనపల్లె పుంగనూరు పట్టణాల్లో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో హంద్రీనీవా నీటిని తరలించి దాహతీని తీర్చాలని కోరారు.