చివ్వేంల అక్కల దేవి గూడెం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలైన సంఘటన చోటు చేసుకుంది... పెదనేమిల గ్రామానికి చెందిన వారు కూలి పనికి వెళ్లి పని ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో అక్కలదేవి గూడెం శివారులో అశోక్ లేలాండ్ వాహనం ఆటోను వెనుక నుంచి డీ కొట్టింది. ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలకు గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..