జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,నూకపల్లి గ్రామ శివారులో వరద కాలువ వద్ద బుధవారం 2ద్విచక్ర వాహనాలు ఢీకొని 950 PM కి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది,తన ద్విచక్ర వాహనంపై జగిత్యాల వైపు నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న శరత్ కుమార్,మరో ద్విచక్ర వాహనంపై కరీంనగర్ వైపు నుండి జగిత్యాల వైపు వెళ్తున్న శ్రీనివాస్ తన భార్య రాజమణి నూకపల్లి వరద కాలువ సమీప వద్దకు రాగానే ఎదురెదురుగా 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి,తల పగిలి రాజమణికి తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించడం ఇరువురి భార్యాభర్తలను ఓ ప్రైవేట్ అంబులెన్స్ లో కరీంనగర్ మరొకరిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు,