కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోతిరాంపూర్ రాజా మెస్ వద్ద విద్యుత్తు ఎల్ టి వైర్ ను మరమతు చేస్తుండగా 33 కెవి విద్యుత్ వైరు తగలడం వల్ల షాక్ కు గురై భూక్య భాస్కర్ అనే కాంట్రాక్టు కార్మికుడు శుక్రవారం సాయంత్రం అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు. అయితే భాస్కర్ భృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు గిరిజన సంఘాల నాయకులు కరీంనగర్ విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.