పొలం పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో యువకుడు మృతిచెందిన ఘటన చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంలో జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. దాసి గోవర్ధన్ పొలం దగ్గర కరెంట్ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.