నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ప్రతిపాదికన బైంసా పట్టణంలోని బస్తీ దవాఖానలో వైద్యాధికారి పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ శనివారం తెలిపారు. ఒక వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉందని ఈనెల 25వ తేదీ లోపు అర్హత గల అభ్యర్థులు www.nirmal.telangana.gov.in వెబ్ సైట్ నుండి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని జిల్లా సమీకృత కార్యాలయం ఎఫ్ 25 లో అందించాలని సూచించారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు.