రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలోని నల్లవారి పల్లి గ్రామానికి చెందిన తెలుగమల జంగయ్య (67) మృదుడు తప్పిపోయినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఎస్సై బలరాం తెలిపిన వివరాల ప్రకారం వృద్ధుడు పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న తన కుమార్తె ఇంటికి వచ్చి, ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం గాలించిన ఎంతకు లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.