సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం నాడు కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఎస్సి బాయ్స్ హాస్టల్ లో మంత్రి డా.స్వామి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల రూ.44 లక్షలతో హాస్టల్ లో మరమ్మతులు చేసినందుకు గాను సీఎం చంద్రబాబు, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.