సూర్యాపేట జిల్లా కేంద్రంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. కోలాటాలు కళాకారుల నృత్యల మధ్య గంగ ఒడికి చేరేందుకు బొజ్జ గణపయ్య సిద్ధమయ్యాడు. గణనాధుడు కొలువుతీరిన శోభాయాత్ర వాహనాన్ని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నడిపారు.