అనకాపల్లి జిల్లాలో ఆటో డ్రైవర్లు నిరసనతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విజయరామరాజుపేట వంతెన కూలిపోవడంతో వడ్డాది-చోడవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చోడవరం వెళ్లే వారు గౌరీపట్నం సింగిల్ రోడ్డులో ఆటోలలోనే వెళ్లాలి. మంగళవారం ఆటో డ్రైవర్లు అనకాపల్లి కలెక్టరేట్ ముట్టడి కారణంగా వడ్డాదిలో ఆటోలు నిలిపివేసి ధర్నా చేశారు. దీంతో వడ్డాది నుంచి చోడవరం వెళ్లే వారు వాహనాలు లేక ఇబ్బంది పడుతున్నారు.