కనిగిరి పట్టణంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ కార్యాలయాలను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. పట్టణంలోని పాత తహసిల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. పాత తహసిల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శిథిలావస్థకు చేరినందున ఈ కార్యాలయాల స్థలాలు ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. శిధిలావస్థకు చేరిన కార్యాలయాల తొలగింపుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.