మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా PACS మరియు యూరియా పంపిణీ కేంద్రాలను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం మధ్యాహ్నం 12:00 లకు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి రైతులను క్యూ లైన్‌లో నిల్చోబెట్టారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎవరికీ ఎంత యూరియా కావాలో అంతా అందుతుందన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతుందన్నారు. ప్రతి రైతుకు యూరియా అందుతుందని భరోసా ఇచ్చారు.