అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని మూలగిరి పల్లె గ్రామంలో మంగళవారం ఇంటింట ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించి కీటక జనిత వ్యాధుల నియంత్రణ కరపత్రాలను వైద్యాధికారులు వైద్య సిబ్బందితో కలిసి ప్రజలకు పంపిణీ చేశారు. రాకెట్ల పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ పావని, ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించి రోగులకు మందులను పంపిణీ చేశారు. మలేరియా నియంత్రణ వర్కర్ల చేత దోమలు నివారణకు క్రిమిసంహారక మందులను ఇంటింటా పిచికారి చేయించారు.