నరసాపురం మున్సిపాలిటీ పరిధిలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శుక్రవారం రాత్రి 8 గంటల వరకు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని చెప్పారు. నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజుతో అయిన సంయుక్తంగా పర్యటన చేపట్టారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు ఇచ్చారు.