విగ్రహాలను పూజించే పండుగే వినాయక చవితి. కానీ ఓ గ్రామం మాత్రం 15 ఏళ్లుగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను పక్కన పెట్టి, ప్రకృతికి మేలు చేసే మట్టి వినాయకులను మాత్రమే పూజిస్తూ పర్యావరణానికి తమ భక్తిని అంకితం చేస్తున్నారు. సంబురాల్లోనే కాదు, బాధ్యతలోనూ ముందున్నారు నారాయణపేట జిల్లా మరికల్ అప్పంపల్లి ప్రజలు. వినాయక చవితి సందర్భంగా.. ఈ మార్గదర్శక గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాటిస్తున్నారు