బాపట్ల పట్టణం శివారులోని ఉప్పరపాలెం, జగనన్న కాలనీలను మూలపాలెం గ్రామంలో విలీనం చేయడం వల్ల ఆ గ్రామం ఎస్సీ హోదాను కోల్పోతుందని బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆరోపించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రెండు కాలనీలను మున్సిపాలిటీలో విలీనం చేయాలని ఆయన కోరారు.