పలమనేరు: పాతపేట శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం నందు గురువారం సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చక స్వాములు స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో ప్రజలు కళ్యాణోత్సవం ఘటాన్ని కనులారా వీక్షించారు.