సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని పలు శాఖల కార్యాలయాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయ, హౌసింగ్ కార్యాలయాలను సందర్శించి, ఆ శాఖల పనితీరును సమీక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలకు సంబంధించి రూపొందించిన నివేదికలు పరిశీలించారు. బాధిత రైతులకు ప్రభుత్వపరంగా సహాయం అందేలా పక్కాగా పంట నష్టం వివరాలు పొందుపర్చాలని సూచించారు. భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా సిరికొండ, ధర్పల్లి, భీమ్గల్, ఇందల్వాయి, వేల్పూర్, వర్ని మండలాలలో పలు పంట పొలాల్లో ఇసుక మేటలు వేసిందని అన్నారు.