డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్ళనంటూ ఓ ఆదివాసీ గర్భిణీ పత్తి పంట చేనులో దాక్కున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రూరల్ మండలంలోని దహి గూడ గ్రామంలో గురువారం వైద్య బృందం పర్యటించింది. అయితే గర్భిణీ వైద్య బృందాన్ని చూసి తనను ఆసుపత్రికి తీసుకెళ్తారని భయంతో తన కుమారుడితో కలిసి గ్రామ సమీపంలోని పత్తి చేనులో దాక్కుంది. వైద్య సిబ్బంది గ్రామంలో ఆమె కోసం వెతకగా, పత్తి చేనులో దాక్కున్న ఆమె కు వైద్య సిబ్బంది అవగాహన కల్పించి ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.