రోడ్డు మీద ఉన్న వర్షపు నీళ్లలో చేపలు కుప్పలు తెప్పలుగా పడిన సంఘటన ఆదివారం ఉదయం సూర్యాపేట నూతనకల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.ఆదివారం ఉదయం రెండు చేపల వాహనాలు చిల్పకుంట్ల గ్రామం మీదుగా నూతన్ కల్ మండల కేంద్రానికి వస్తుండడంతో బాగా గుంటల మైన ప్రదేశానికి రాగానే ఒడిదుడుకుల్లో చేపల లోడు డోరు విరగడంతో చేపలు రోడ్డు గుంటలో పడిపోయాయి. వెంటనే వాహన చోదకులు వలలు వేసి ఆ చేపలను పట్టుకున్నారు. ఈ సంఘటనను అక్కడికి వచ్చిన స్థానికులు ఆశ్చర్యంగా చూశారు