ఈరోజు గురువారం ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఉదయం ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం రెండింటి వరకు జరగగా మూడు గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ 6 గంటల వరకు జరిగింది. ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా 12 మంది డైరెక్టర్ల స్థానాలకు 25 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు వర్గం ఘనవిజయం సాధించింది. తన అభివృద్ధి చూసి తనకు మళ్ళీ ఓటర్లు అవకాశం ఇచ్చారని వారి ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తానని ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు.