పలమనేరు: మండల పరిధి నాగ మంగళం వద్ద స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. నాగమంగళంకు చెందిన నజీమ్ అనే యువకుడు ద్విచక్ర వాహనంలో తన ఇంటికి వెళ్తుండగా రాంగ్ రూట్లో ద్విచక్ర వాహనంలో వచ్చిన మరో యువకుడు వేగంగా ఢీకొని వెళ్లిపోయాడని, దీంతో నజీమ్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా గమనించి 108 వాహనానికి సమాచారం అందించి వైద్యం కొరకు పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. ఘటనపై స్థానిక పోలీసులకు సైతం సమాచారం అందించామన్నారు వారి దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.