యూరియా కోసం షాపులవద్ద పడిగాపులు కాస్తున్న రైతన్నలను యురియా కష్టాలు వెంటాడుతున్నాయి. ఆత్మకూరు వ్యవసాయ సబ్ డివిజన్ లోని వెలుగోడు,పా ములపాడు, కొత్తపల్లి, ఆత్మకూరులో యూరియా కోసం మంగళవారం ఉదయం ఐదు గంటల నుండి క్యూలైన్లలో బారులూ తీరినప్పటి రైతులకు ఉపశమనం లభించడంలేదు. పది రోజులుగా యురియా దొరకరడం లేదు . నేడు అనగా మంగళవారం యురియా స్టాక్ రావడంతో రైతులు నుంచి తెల్లవారుజాము నుంచి క్యూ లైన్ లలో నిలబడితే ఒక రైతుకు రెండు బస్తాల యురియా చొప్పున మూడు గంటలు క్యూలైన్లో నిలుచుంటే టోకెన్ ఇస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ బస్తాల కోసం సాయంత్రం రమ్మంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.