నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ప్రధాన వంతెనపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహింస్తోంది. దీంతో అటుగా వెళ్లేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు ప్రధాన రోడ్లపై నుంచి వెళ్తున్నాయి. మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి.