అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ ధనరాజ్ సూచించారు. వర్షపు నీరు త్రాగే నీరుతో కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సోమవారం సిద్దిపేట పట్టణంలోని కెసిఆర్ నగర్ బస్తీ దవాఖాన , అంబేద్కర్ నగర్ అర్బన్ సెంటర్ లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా, ముందుగా ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు, అనంతరం ల్యాబ్ ను, మరియు ఫార్మసీ స్టోర్ను సందర్శించి రిజిస్టర్లను, పరిశీలించారు. ఫార్మసి స్టోర్లో కాలం చెల్లిన మందులు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు