వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా హిందూ పెద్దలు, ముస్లిం పెద్దలతో సిద్దిపేట పట్టణంలోని ఎన్జీవోస్ భవన్ లో సోమవారం సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐలు వాసుదేవరావు, విద్యాసాగర్, ఉపేందర్ లు పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఏసిపి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. జాతి మతం కులం వర్గం అనే బేధాలు లేకుండా అందరూ కలిసిమెలిసిగా ఉండడం చాలా ముఖ్యమని తెలిపారు. అన్ని మజీదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయో ప్రతిరోజు మానిటర్ చేసుకోవాలని తెలిపారు. హైదరాబాదులో మిలాద్ ఉన్ నబీ ఏరోజు జరుపుకుంటున్నారో