తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. తన సంక్షేమ పథకాలతో పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్ చెరగని ముద్ర వేశారని అన్నారు. పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేశారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అని అన్నారు.