గుంటూరు జిల్లా పెదవడ్లపూడి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం 50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. తెనాలి జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లేత గోధుమరంగు షర్టు, కాఫీ పొడి రంగు ప్యాంటు ధరించిన వ్యక్తి జేబులో సెల్ఫోన్ చార్జర్, తాళం చెవి లభించాయి. రైలు నుంచి జారి మృతి చెందినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు.