మెగా డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నందవరం యువకులు..ప్రభుత్వ 2025 మెగా డీఎస్సీ ఫలితాల్లో నందవరం గ్రామానికి చెందిన లాడిగొండ రవి (80.4 మార్కులు), కురువ నరసింహులు (78.1 మార్కులు) ఉపాధ్యాయ పోస్టులు పొందారు. రవి ట్యూషన్ చెప్పి జీవనం సాగించేవారు. కష్టపడి చదివి తన లక్ష్యాన్ని సాధించారు. తల్లిదండ్రులు విజయాన్ని సంతోషంతో స్వాగతించారు. పలువురు అభినందనలు తెలిపారు.