మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భుగర్భజలాలు, పియం కుసుమ్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు, సోలార్/విండ్ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సంబంధిత అంశాలు, స్వచ్ఛాంధ్ర అవార్డులు అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ కాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి. శివన్నారాయణ రెడ్డి పాల్గొన్నారు. కర్నూలు ఉల్లిపాయలు వినియోగంపై జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆయనకు వివరించారు.