రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు పెద్దన్న గౌడ్ సూచించారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో సోమవారం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల సాధనకు కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆదేశాలు పాటించాలని అన్నారు.