యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిఎస్ఆర్ ఫండ్స్ నుండి మంజూరైన నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు మంచి చేయాలని ఉద్దేశంతో పనిచేస్తున్నారని తెలిపారు. పదేళ్లలో ఏ ఒక్కరికి గత ప్రభుత్వం ఇండ్లు ఇవ్వలేదని, ఒక ఆలేరు నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.